మ్యాంగో ఫిర్ని

ABN , First Publish Date - 2016-04-30T20:55:53+05:30 IST

కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం- పావు కప్పు, క్రీమ్‌ మిల్క్‌- 4 కప్పులు, చక్కెర- కప్పులో మూడోవంతు, ఆల్మండ్స్‌- 10, మామిడి గుజ్జు- 1 కప్పు, ఆకుపచ్చ ఏలకుల పిండి- అర టీస్పూన్‌, పిస్తా- పిడికిలిలో పట్టినంత

మ్యాంగో ఫిర్ని

కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం- పావు కప్పు, క్రీమ్‌ మిల్క్‌- 4 కప్పులు, చక్కెర- కప్పులో మూడోవంతు, ఆల్మండ్స్‌- 10, మామిడి గుజ్జు- 1 కప్పు, ఆకుపచ్చ ఏలకుల పిండి- అర టీస్పూన్‌, పిస్తా- పిడికిలిలో పట్టినంత.
 
తయారీవిధానం: మొదట మ్యాంగో ఫిర్ని చేసుకునే ముందు.. నాలుగు కప్పుల పాలను మూడు వంతులు వచ్చే వరకు మరబెట్టాలి. ఆ పాలలోకి నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమానికి మరో అరకప్పు వేడి పాలను వేసి కలియబెట్టాలి. కాసేపయ్యాక చిక్కబడుతుంది. ఈ మిశ్రమంలోకి ముందుగానే తయారు చేసి పెట్టుకున్న అల్మండ్‌ పేస్ట్‌ వేయాలి. అందులోకి ఏలకుల పొడి, చక్కెర వేయాలి. ఇలా పదినిమిషాల పాటు పాత్రను కదిపి పాకంలాగ వచ్చేంత వరకు స్టౌ మీద ఉంచాలి. ఆ మిశ్రమం మామూలు గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చిన తర్వాత ఆ మిశ్రమంలోకి మామిడి గుజ్జును కలపి బాగా మిక్స్‌ చేస్తే మ్యాంగో ఫిర్నీ రెడీ అవుతుంది. దీంట్లోకి చిన్న చిన్న ముక్కలు గా చేసుకున్న పిస్తా పలుకులను గార్నిస్‌ కోసం వేసుకుంటే మ్యాంగోఫిర్నీ సిద్ధం అయినట్లే

Updated Date - 2016-04-30T20:55:53+05:30 IST