గార్లిక్‌ ప్రాన్స్‌

ABN , First Publish Date - 2017-11-05T20:29:30+05:30 IST

రొయ్యలు - 200 గ్రా., ఆలివ్‌ ఆయిల్‌ - 4 టేబుల్‌ స్పూన్లు, వెల్లుల్లి తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, చిల్లీ ఫ్లేక్స్‌...

గార్లిక్‌ ప్రాన్స్‌

కావలసిన పదార్థాలు
రొయ్యలు - 200 గ్రా., ఆలివ్‌ ఆయిల్‌ - 4 టేబుల్‌ స్పూన్లు, వెల్లుల్లి తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, చిల్లీ ఫ్లేక్స్‌ - అర టీ స్పూను, ఉప్పు, మిరియాల పొడి - రుచికి సరిపడా, నిమ్మరసం - ఒక టేబుల్‌ స్పూను, కారం - ఒక టీ స్పూను, పార్సలీ తరుగు - ఒక టేబుల్‌ స్పూను.
తయారుచేసే విధానం
పాన్‌లో ఆలివ్‌ ఆయిల్‌తో పాటు వెల్లుల్లి తరుగు, చిల్లీ ఫ్లేక్స్‌ వేసి స్టవ్‌ వెలిగించాలి. ఆయిల్‌ వేడి అయ్యాక మరో నిమిషం వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్‌ వేగించి శుభ్రం చేసిన రొయ్యలు వేసి దోరగా వేగించాలి. ఇప్పుడు ఉప్పు, మిరియాల పొడి కలిపి నిమ్మరసం చల్లి అర నిమిషం తర్వాత మంట తీసెయ్యాలి. చివర్లో కారం, పార్సలీ తరుగు కలపాలి. ఈ వంటకం బ్రెడ్‌తో తింటే బాగుంటుంది.

Updated Date - 2017-11-05T20:29:30+05:30 IST