బాదం షర్బత్

ABN , First Publish Date - 2016-04-16T02:45:15+05:30 IST

కావలసినవి: బాదం గింజలు - అరకప్పు, యాలక్కాయల పొడి - రెండు టీస్పూన్లు, పంచదార - రెండు కప్పులు, నీళ్లు - నాలుగు పెద్ద కప్పులు.

బాదం షర్బత్

కావలసినవి: బాదం గింజలు - అరకప్పు, యాలక్కాయల పొడి - రెండు టీస్పూన్లు, పంచదార - రెండు కప్పులు, నీళ్లు - నాలుగు పెద్ద కప్పులు.
 
తయారీ: బాదం గింజల్ని నీళ్లలో ఒక రాత్రంతా నానబెట్టాలి. తరువాత వాటి పొట్టు తీసేయాలి. ఒక పెద్ద గిన్నెలో పంచదార, నీళ్లు, యాలక్కాయల పొడి వేసి వేడిచేయాలి. పంచదార పాకం తీగలా వచ్చేవరకు ఉంచి తరువాత చల్లారనివ్వాలి. ఆ తరువాత ఈ పాకం కొంత తీసి బాదం గింజలతో కలిపి మెత్తటి పేస్ట్‌లా రుబ్బాలి. గాలిచొరబడని గాజుసీసాలో షర్బత్ పోసేయాలి. తాగాలనిపించినప్పుడు ఇందులో కొన్ని ఐస్‌క్యూబ్స్‌ లేదా కొంచెం చల్లటి నీళ్లు కలుపుకుని తాగాలి.

Updated Date - 2016-04-16T02:45:15+05:30 IST