సపోటా ఐస్‌క్రీమ్
ABN , First Publish Date - 2016-04-02T17:31:03+05:30 IST
సపోటా ముక్కలు - 2 కప్పులు, పాలు - 1 లీటరు, కార్న్‌ఫ్లోర్ - 1 టే.స్పూను, జెలటిన్ - 1 టీ.స్పూను , తాజా క్రీమ్ - అర కప్పు ,చక్కెర పొడి - 4 టే.స్పూన్లు.
- పావుకప్పు పాలు పక్కనుంచి మిగతావి నాన్‌స్టిక్ పాన్‌లో మరిగించాలి. తర్వాత మంట తగ్గించి 20 నిమిషాలపాటు కలుపుతూ ఉండాలి.
- తర్వాత మంట తీసి చల్లారనివ్వాలి.
- పక్కనుంచిన పావు కప్పు పాలలో కార్న్‌ఫ్లోర్ కలపాలి.
- దీన్ని మరిగించిన పాలలో కలిపి మళ్లీ పొయ్యి మీద ఉంచి ఆపకుండా కలుపుతూ పెద్ద మంట మీద 5 నిమిషాలు మరిగించాలి.
- కొద్దిగా నీళ్లలో 2 టే.స్పూన్ల జెలటిన్ నానబెట్టి పూర్తిగా కరిగేవరకూ పొయ్యి మీద ఉంచి వేడి చేయాలి.
- దీన్ని మరిగించిన పాల మిశ్రమంలో పోసి 3 గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి.
- క్రీమ్, చక్కెర పొడి రెండూ స్పూన్‌తో గిలక్కొట్టాలి.
- ఫ్రిజ్‌లో గట్టిపడ్డ పాల మిశ్రమాన్ని తీసి బ్లెండర్‌లో వేసి తిప్పాలి.
- దీనికి గిలక్కొట్టిన క్రీమ్, సపోటా ముక్కలు, ఎసెన్స్ చేర్చి కలిపి సెట్ అయ్యేవరకూ ఫ్రిజ్‌లో ఉంచాలి. ఫ్రిజ్‌లోనుంచి బయటకు తీసి తింటే యమ్మీగా ఉంటుంది.