తర్బూజా ఐస్‌క్రీమ్

ABN , First Publish Date - 2016-04-02T17:29:01+05:30 IST

కావలసినవి: తర్బూజా పండు - 1, చిక్కని పాలు - 1 లీటరు, తాజా క్రీమ్‌ - 1 కప్పు, చక్కెర - 3/4 కప్పులు, కార్న్‌ ఫ్లోర్‌ - 2 టే.స్పూన్లు, వెనిల్లా ఎసెన్స్‌ - 2 చుక్కలు.

తర్బూజా ఐస్‌క్రీమ్

కావలసినవి: తర్బూజా పండు - 1, చిక్కని పాలు - 1 లీటరు, తాజా క్రీమ్‌ - 1 కప్పు, చక్కెర - 3/4 కప్పులు, కార్న్‌ ఫ్లోర్‌ - 2 టే.స్పూన్లు, వెనిల్లా ఎసెన్స్‌ - 2 చుక్కలు.
 
తయారీవిధానం:
  • తర్బూజా పండు గుజ్జు చేసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
  • పాలు కాగబెట్టి పావు లీటరు పాలు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
  • చల్లబడ్డ పాలలో కార్న్‌ఫ్లోర్‌ కలపాలి.
  • మిగతా పాలను పావుగంటపాటు మరిగించాలి.
  • ఈ పాలలో ముందుగా కార్న్‌ఫ్లోర్‌ కలిపిన పాలను కొద్దికొద్దిగా పోస్తూ కలపాలి.
  • చిన్న మంట మీద 3 నిమిషాలు మరిగించాలి.
  • మంట తీసి చక్కెర, ఎసెన్స్‌ వేసి కరిగేవరకూ తిప్పి రూమ్‌ టెంపరేచర్‌కు చల్లార్చాలి.
  • ప్లాస్టిక్‌ మూత పెట్టి గడ్డకట్టేవరకూ కాకుండా గట్టిపడేవరకూ ఫ్రీజర్‌లో ఉంచాలి.
  • తర్వాత తీసి మెత్తబడేవరకూ స్పూన్‌తో బీట్‌ చేయాలి.
  • తాజా క్రీమ్‌ను కూడా బాగా బీట్‌ చేసి ఐస్‌క్రీమ్‌కు కలపాలి.
  • తర్వాత తర్బూజా గుజ్జును వేసి కలిపి ఫ్రీజర్‌లో ఉంచాలి.
  • బాగా సెట్‌ అయ్యాక బౌల్స్‌లో తీసి తింటే టేస్టీగా ఉంటుంది.

Updated Date - 2016-04-02T17:29:01+05:30 IST