మ్యాంగో, అవకాడో సల్సా

ABN , First Publish Date - 2018-04-28T21:55:43+05:30 IST

మామిడిపండు- ఒకటి (ముక్కలు తరిగి), అవకాడో-ఒకటి (ముక్కలు తరిగి), ఉల్లిపాయ- సగం..

మ్యాంగో, అవకాడో సల్సా

కావలసినవి
 
మామిడిపండు- ఒకటి (ముక్కలు తరిగి), అవకాడో-ఒకటి (ముక్కలు తరిగి), ఉల్లిపాయ- సగం ముక్క (సన్నగా తరిగి), కొత్తిమీర- అర కప్పు (సన్నగా తరిగి), నిమ్మరసం-రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు-పావు టీస్పూను, నల్లమిరియాలపొడి- చిటికెడు (సీజనింగ్‌కి).
 
తయారీవిధానం
 
ఒక గిన్నెలో మామిడిపండు, అవకాడోముక్కలతో పాటు ఉల్లి, కొత్తిమీర తరుగు వేయాలి.
ఈ మిశ్రమంపై నిమ్మరసం, ఉప్పు, మిరియాలపొడులను చల్లి తింటే బాగుంటుంది.
వెంటనే తినాలనుకోకపోతే దానిపై ప్లాస్టిక్‌ ర్యాపర్‌ అతికించి ఫ్రిజ్‌లో పెట్టి మీకు కావాల్సినప్పుడు తినొచ్చు.

Updated Date - 2018-04-28T21:55:43+05:30 IST