మునగాకు ఎగ్‌ రోల్స్‌

ABN , First Publish Date - 2017-09-16T22:15:53+05:30 IST

(తరిగిన) మునగాకు - ఒక కప్పు, గుడ్లు - 4, మైదా - ఒక టేబుల్‌ స్పూను, ఉప్పు, మిరియాల పొడి...

మునగాకు ఎగ్‌ రోల్స్‌

కావలసిన పదార్థాలు
 
(తరిగిన) మునగాకు - ఒక కప్పు, గుడ్లు - 4, మైదా - ఒక టేబుల్‌ స్పూను, ఉప్పు, మిరియాల పొడి - రుచికి తగినంత, పచ్చిమిర్చి - 2, చీజ్‌ - పావు కప్పు, నూనె - ఒక టేబుల్‌ స్పూను.
 
తయారుచేసే విధానం
 
నూనెలో మునగాకు, ఉప్పు వేసి తడి పోయేవరకు వేగించి చల్లారనివ్వాలి. మరో పాత్రలో గుడ్లు, మైదా, ఉప్పు, మిరియాలపొడి, పచ్చిమిర్చి తరుగు వేసి గిలకొట్టి (దీర్ఘచతురస్రంగా ఉండే) బేకింగ్‌ పాన్‌లో సమంగా పోసి, వేగిన మునగాకు చల్లి, ఆ పైన చీజ్‌ తురమాలి. తర్వాత పాన్‌ను అల్యూమినియమ్‌ కాగితంలో చుట్టి 180 డిగ్రీల వద్ద ప్రీ హీట్‌ చేసిన ఓవెన్‌లో 15 నిమిషాలు ఉంచి తీయాలి. చల్లారిన తర్వాత జాగ్రత్తగా రోల్స్‌లా చుట్టాలి. ఇవి టిఫిన్‌గా బాగుంటాయి.

Updated Date - 2017-09-16T22:15:53+05:30 IST