Abn logo

పన్నీర్‌ పిజ్జా

కావలసిన పదార్థాలు
 
పన్నీర్‌ ముక్కలు - 100 గ్రాములు, పిజ్జా సాస్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు, మిరియాల పొడి రుచికి సరిపడా, నూనె - వేపుడుకు సరిపడా, తులసి ఆకులు - 4 (సన్నగా తరగాలి), మెజెరెల్లా చీజ్‌ - తగినంత, గోధుమ పిండి - 2 కప్పులు, నూనె - సరిపడా, పాలు - అర కప్పు, మిరియాల పొడి - 1 టీస్పూను.
తయారీ విధానం
 
గోధుమ పిండికి పాలు చేర్చి మెత్తగా పిసుక్కోవాలి. ముద్దను సమ భాగాలుగా చేసుకుని పరోటాలు ఒత్తుకోవాలి. ఈ పరోటాను పీట మీద ఉంచి పైన పిజ్జా సాస్‌ పరుచుకుని, పన్నీర్‌, మోజెరెల్లా చిలకరించాలి. ఉప్పు, తులసి ఆకులు, మిరియాల పొడి చల్లి అంచులు నీళ్లతో తడి చేసుకోవాలి. దీని మీద మరో పరోటా ఉంచి అంచులు మూసేయాలి. పెనం మీద నూనె వేసి ఈ పరోటాలను రెండు వైపులా కాల్చుకోవాలి. వేడిగా పుదీనా చట్నీతో సర్వ్‌ చేయాలి.

అందుబాటులోకి అన్ని బస్సు సర్వీస్‌లుజాతీయ ఉపకార వేతనాలకు 32 మంది ఎంపికఎన్టీఆర్‌ సేవలు మరువలేనివి సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలివైకుంఠధామాల నిర్మాణానికి అడ్డంకులుఈసారైనా పూర్తయ్యేనా..?‘రైతు సమస్యలు తెలుసుకుంటే ఉలికిపాటు దేనికి?’రేవంత్‌ అంటే ఎందుకు భయం?చెక్‌డ్యామ్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపనఅభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయండి
Advertisement
d_article_rhs_ad_1
Advertisement