హనీ కేక్

కావలసిన పదార్థాలు
మైదా- ఒక కప్పు, చక్కెర పొడి- ఒక కప్పు, వెన్న లేదా నెయ్యి- 100 గ్రా., తినే సోడా- అర టీ స్పూను, గుడ్లు- 2, పాలు- 3 టేబుల్‌ స్పూన్లు, వెనీలా ఎసెన్స్‌- అర టేబుల్‌ స్పూను, తేనె- అర కప్పు, చక్కెర- 3 టేబుల్‌ స్పూన్లు, జామ్‌- 5 టేబుల్‌ స్పూన్లు, పచ్చికొబ్బరి తురుము- 2 టేబుల్‌ స్పూన్లు.
 
తయారీ విధానం
మైదా, చక్కెర పొడి, తినే సోడా, వెన్నె, గుడ్లు, పాలు, వెనీలా ఎసెన్స్‌లను బాగా గిలక్కొట్టుకుని ఓవెన్‌లో బేక్‌ చేయాలి లేదా కుక్కర్‌లో ఆరు విజిల్స్‌ వచ్చే దాకా ఉంచాలి. తర్వాత బయటికి తీసి చల్లారనివ్వాలి. ఒక గిన్నెలో తేనె, ఒక టేబుల్‌ స్పూను చక్కెర, అర కప్పు నీళ్లు పోసి కలుపుకుని కేక్‌ మీద సమానంగా పరవాలి. మిగిలిన చక్కెర జామ్‌లో వేసి చిన్న మంట మీద రెండు నిమిషాలు వేడిచేయాలి. తర్వాత కేక్‌ మీద సమానంగా రాసి, చివరగా కొబ్బరి తురుమును పైన చల్లాలి.

పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలుసీసీ రోడ్డుపైనే బీటీ రోడ్డు నిర్మాణంపైకప్పు కూలినా.. పట్టింపు కరువుహెల్మెట్‌ ధరిస్తేనే రోడ్లపైకి అనుమతి : సీఐమూడు దశాబ్దాల సమస్యకు పరిష్కారం!కమ్ముకుంటున్న కారుమబ్బులువానాకాలం సాగుకు రైతులు సన్నద్ధంనత్తనడకన బావి నిర్మాణ పనులుతాంసిలో ఈదురు గాలులుమటన్‌ షాపుల వద్ద సండే సందడి
Advertisement
Advertisement