గోధుమ లడ్డు

ABN , First Publish Date - 2015-09-01T23:05:21+05:30 IST

కావలసిన పదార్థాలు: గోధుమలు - 1 కప్పు, బెల్లం తురుము - 1 కప్పు,

గోధుమ లడ్డు

కావలసిన పదార్థాలు: గోధుమలు - 1 కప్పు, బెల్లం తురుము - 1 కప్పు, నెయ్యి - అర కప్పు.
తయారుచేసే విధానం: గోధుమలు దోరగా వేగించి చల్లారిన తర్వాత గ్రైండు చేయాలి. ఇందులోనే బెల్లం తురుము వేసి రెండూ బాగా కలిసేలా మరోసారి గ్రైండర్లో తిప్పాలి. ఈ మిశ్రమాన్ని ఒక పళ్లెంలోకి తీసుకుని గోరువెచ్చని నెయ్యి కలుపుతూ కొద్ది కొద్ది పిండి తీసుకుని ఉండలు చుట్టుకోవాలి. గాలి చొరని డబ్బాలో పది రోజుల వరకు నిలవ ఉంటాయి.

Updated Date - 2015-09-01T23:05:21+05:30 IST