చికెన్‌ ఫర్చా

ABN , First Publish Date - 2016-09-24T18:43:35+05:30 IST

మారినేషన్‌ కోసం: చికెన్‌ - అర కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 20 గ్రా, డేగ్చీ మిర్చి - 1 టీస్పూను, నిమ్మరసం - 1 టీస్పూను,ఉప్పు - తగినంత .

చికెన్‌ ఫర్చా

కావలసిన పదార్థాలు:
మారినేషన్‌ కోసం: చికెన్‌ - అర కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 20 గ్రా, డేగ్చీ మిర్చి - 1 టీస్పూను, నిమ్మరసం - 1 టీస్పూను,ఉప్పు - తగినంత .
రెండో మారినేషన్‌: మైదా - 25 గ్రా, కార్న్‌ ఫ్లోర్‌ - 10 గ్రా, బియ్యంపిండి - 8 గ్రా, డేగ్చీ మిర్చి - 10 గ్రా, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 15 గ్రా, ఎగ్‌ - 1, నిమ్మరసం - 1 టే.స్పూను, ఉప్పు - రుచికి సరిపడా
 
తయారీ విధానం: చికెన్‌ కడిగి ఫస్ట్‌ మారినేషన్‌లో సూచించిన పదార్థాలతో కొన్ని గంటలపాటు నానబెట్టాలి. తర్వాత రెండో మారినేషన్‌ కలపాలి. తర్వాత చికెన్‌ ముక్కల్ని నూనెలో వేయించి పేపర్‌ టవల్‌ మీద ఉంచాలి. పుదీనా చట్నీతో వేడిగా సర్వ్‌ చేయాలి.

Updated Date - 2016-09-24T18:43:35+05:30 IST