మ్యాంగో కుల్ఫీ

ABN , First Publish Date - 2017-05-20T20:43:23+05:30 IST

కావలసినవి పదర్థాలు ఆవు పాలు లేదా బాదం పాలు - రెండున్నర కప్పులు, మామిడి పండు గుజ్జు (దాదాపు మూడు నాలుగు పెద్ద అల్ఫాన్సో మామిడి పండ్లు కావాలి) - రెండున్నర కప్పులు, పంచదార - పావు లేదా అరకప్పు (పండ్ల తియ్యదనాన్ని బట్టి పంచదార మోతా

మ్యాంగో కుల్ఫీ

కావలసినవి పదర్థాలు
 
ఆవు పాలు లేదా బాదం పాలు - రెండున్నర కప్పులు, మామిడి పండు గుజ్జు (దాదాపు మూడు నాలుగు పెద్ద అల్ఫాన్సో మామిడి పండ్లు కావాలి) - రెండున్నర కప్పులు, పంచదార - పావు లేదా అరకప్పు (పండ్ల తియ్యదనాన్ని బట్టి పంచదార మోతాదు వాడాలి), ఆకుపచ్చ యాలకల పొడి - పావు టీస్పూన్‌, కుంకుమపువ్వు - చిటికెడు, ఉప్పు వేయని పిస్తా పప్పు - 15 (నానబెట్టి పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. వీటిలో కొన్నింటిని అలంకరణకు పక్కన పెట్టాలి), బాదం పప్పుల గుజ్జు - మూడు టేబుల్‌ స్పూన్లు లేదా కోవా (అవసరమనుకుంటే), బియ్యప్పిండి - మూడు టేబుల్‌ స్పూన్లు లేదా మొక్కజొన్నపిండి - రెండు టేబుల్‌ స్పూన్లు(మూడు టేబుల్‌ స్పూన్ల పాలలో లేదా బాదం పాలలోకలపాలి).
 
తయారీ విధానం
కుంకుమపువ్వు, బాదం పాలను పాన్‌లో పోయాలి.
స్టవ్‌ వెలిగించి సన్నటి మంట మీద బాదం పాలు పోసిన పాన్‌ను పావుగంట ఉంచాలి. బాదం పాలు కాస్త వేడెక్కితే చాలు ఉడుకుపట్టేలా వేడి చేయొద్దు.
ఒకవేళ ఆవు పాలు వాడుతుంటే సన్నటి మంట మీద పావు గంట వేడిచేయాలి.
తరువాత పంచదార వేసి అది పూర్తిగా కరిగేవరకు కలపాలి.
బియ్యప్పిండిని మూడు టేబుల్‌ స్పూన్ల పాలలో కలపాలి. ఈ మిశ్రమాన్ని పాలలో పోసి గరిటెతో కలుపుతుండాలి. ఇలా చేయడం వల్ల మిశ్రమం ఉండలు కట్టకుండా ఉంటుంది.
సన్నటి మంట మీదనే ఉంచి మధ్య మధ్యలో కలుపుతుండాలి. మిశ్రమం చిక్కబడ్డాక స్టవ్‌ ఆపేయాలి.
తరువాత బాదం గుజ్జు కలిపి మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.
చల్లారిన మిశ్రమంలో మామిడి పండు గుజ్జు, తరిగిన పిస్తా పలుకులు వేసి కలపాలి.
తయారైన మ్యాంగో కుల్ఫీని సర్వింగ్‌ బౌల్స్‌ లేదా కుల్ఫీ అచ్చుల్లో వేసి ఎనిమిది నుంచి పది గంటలు ఫ్రీజర్‌లో ఉంచాలి.
ఆ తరువాత చల్లటి మ్యాంగో కుల్ఫీ పైన కుంకుమపువ్వు, పిస్తా పలుకులు, యాలకల పొడితో అలంకరించి తింటే చల్ల చల్లని కుల్ఫీతో... అని పాటలు పాడడం ఖాయం.

Updated Date - 2017-05-20T20:43:23+05:30 IST