చింతచిగురు మటన్‌

ABN , First Publish Date - 2019-05-04T19:47:46+05:30 IST

మటన్‌ - అరకేజీ, చింతచిగురు - అరకేజీ, కొబ్బరి తురుము - ఒక టీస్పూన్‌, కొత్తిమీర - ఒకకట్ట, అల్లంవెల్లుల్లి పేస్టు

చింతచిగురు మటన్‌

కావలసిన పదార్థాలు
 
మటన్‌ - అరకేజీ, చింతచిగురు - అరకేజీ, కొబ్బరి తురుము - ఒక టీస్పూన్‌, కొత్తిమీర - ఒకకట్ట, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌, పుదీనా - ఒక కట్ట, ఆవాలు - ఒక టీస్పూన్‌, నూనె - ఒక టేబుల్‌స్పూన్‌, ఉల్లిపాయలు - రెండు, కారం - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - కొద్దిగా.
 
తయారుచేయు విధానం
 
ఒక పాన్‌ తీసుకొని నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తరువాత తరిగిన ఉల్లిపాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలుపుకోవాలి. కాసేపు వేగిన తరువాత గరం మసాల, కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మటన్‌ వేసుకొని కొద్దిగా నీళ్లు చేర్చి ఉడికించుకోవాలి. తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. చివరగా చింతచిగురును చేర్చి మరికాసేపు ఉడికించుకోవాలి. కూర చిక్కగా అయ్యాక దింపుకోవాలి.

Updated Date - 2019-05-04T19:47:46+05:30 IST