మ్యాంగో ఐస్‌క్రీం

ABN , First Publish Date - 2017-04-30T19:48:44+05:30 IST

మామిడి పండు గుజ్జు- ఒక కప్పు, మామిడి పండ్లు- రెండు (చిన్న ముక్కలుగా కోయాలి), పాలు- ఒక

మ్యాంగో ఐస్‌క్రీం

కావలసిన పదార్థాలు
 
మామిడి పండు గుజ్జు- ఒక కప్పు, మామిడి పండ్లు- రెండు (చిన్న ముక్కలుగా కోయాలి), పాలు- ఒక కప్పు, వెన్న లేదా క్రీమ్‌- మూడు కప్పులు, కస్టర్డ్‌ పౌడర్‌- ఒక టేబుల్‌ స్పూను, వెనీలా- ఒక టేబుల్‌ స్పూను, చక్కెర- ఒక కప్పు.
 
తయారీ విధానం
 
పావు కప్పు పాలల్లో కస్టర్డ్‌ పౌడర్‌ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పాలల్లో చక్కెర వేసి వేడి చేయాలి. పాలు మరుగుతున్నప్పుడు కస్టర్డ్‌ పౌడర్‌ కలిపిన పాలు కూడా పోసి 2 నిమిషాలు మరిగించి, దింపేసి చల్లారనివ్వాలి. తర్వాత మామిడి పండు గుజ్జు, ముక్కలు, వెన్న, వెనీలా వేసి బాగా కలిపి మూడు గంటలు డీప్‌ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.

Updated Date - 2017-04-30T19:48:44+05:30 IST