చికెన్‌ చుక్కా

ABN , First Publish Date - 2018-09-12T23:07:15+05:30 IST

చికెన్‌: కిలో, ఉల్లిపాయలు: అరకిలో, అల్లం వెల్లుల్లి ముద్ద: రెండు స్పూన్లు, పచ్చిమిరపకాయలు...

చికెన్‌ చుక్కా

కావలసిన పదార్థాలు
 
చికెన్‌: కిలో, ఉల్లిపాయలు: అరకిలో, అల్లం వెల్లుల్లి ముద్ద: రెండు స్పూన్లు, పచ్చిమిరపకాయలు: ఆరు లేక ఏడు(ముక్కలుగా కట్‌ చేసుకోవాలి), కొత్తిమీర: కట్ట, నీరు: తగినంత, నూనె: తగినంత, టమోటాలు: మూడు లేదా, టమోటా గుజ్జు: రెండు స్పూన్లు. కారం: రెండు స్పూన్లు(కావలసిన వారు ఎక్కువ వేసుకోవచ్చు), పసుపు: చిటికెడు, ఉప్పు: రుచికి సరిపడ, ధనియాల పొడి: టేబుల్‌ స్పూను, తందూరి మసాలా పొడి: రెండు స్పూన్లు, రెడ్‌ కలర్‌: కొద్దిగా.
 
తయారీ విధానం
 
ముందుగా చికెన్‌ ముక్కల్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. అనంతరం అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసి మరికొద్దిసేపు వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తరువాత చికెన్‌ ముక్కలు, ఫుడ్‌ కలర్‌ తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా వేగనివ్వాలి. ఐదారు నిమిషాల తరువాత శుభ్రం చేసుకున్న చికెన్‌ ముక్కలను వేసి కొద్దిగా నీరు పోసి సన్నని మంట మీద ఉడికించుకోవాలి. నీరంతా ఇంకిపోయిన తరువాత ఫుడ్‌ కలర్‌ వేసుకోవాలి. ఫైనల్‌గా కొత్తిమీర ఆకులు కూడా జతచేసి దింపేయాలి. ఇది అన్నం లేదా, చపాతీల్లోకి రుచిగా ఉంటుంది.

Updated Date - 2018-09-12T23:07:15+05:30 IST