నర్గీస్ కోఫ్తా

ABN , First Publish Date - 2017-02-25T19:05:27+05:30 IST

ఉడికించిన గుడ్లు- 4, శనగపిండి- 2 టేబుల్‌స్పూన్లు, చికెన్‌- పావుకిలో, పసుపు- అర

నర్గీస్ కోఫ్తా

కావలసిన పదార్థాలు
 
ఉడికించిన గుడ్లు- 4, శనగపిండి- 2 టేబుల్‌స్పూన్లు, చికెన్‌- పావుకిలో, పసుపు- అర టీస్పూను, ఎండుమిర్చి- 8, ధనియాల పొడి- 1 టేబుల్‌స్పూను, దాల్చినచెక్క- అంగుళం ముక్క, నువ్వులు- అర టీస్పూను, వాము- పావు టీ స్పూను, యాలకులు- 2, గరం మసాలా- అర టీస్పూను, తరిగిన ఉల్లిపాయ, టమోటా- ఒక్కోటి చొప్పున, నిమ్మరసం- అర టీస్పూను, కారం- అర టేబుల్‌స్పూను, సోంపు పొడి- అర టీస్పూను, కొత్తిమీర, కరివేపాకు- కొద్దిగా, పచ్చిమిర్చి- రెండు, మెంతి పొడి- పావు టీస్పూను, లవంగాలు- 4, పెరుగు- పావు కప్పు, నూనె- వేగించడానికి సరిపడా, ఉప్పు- తగినంత.
 
తయారీ విధానం
 
చికెన్‌లో ఎండుమిర్చి, దాల్చిన చెక్క, నువ్వులు, యాలకులు, వాము వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో పసుపు, శనగపిండి, ధనియాల పొడి, కొద్దిగా నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. బాణలిలో నూనె పోసి వేడెక్కాక గుడ్లను ఈ పిండిలో ముంచి బజ్జీల్లా కాల్చుకోవాలి. తర్వాత మరో బాణలిలో ఒక టేబుల్‌ స్పూన్‌ నూనె పోసి వేడెక్కాక లవంగాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాలు వేగించాలి. తర్వాత టమోటాలు, మెంతి పొడి, కారం, సోంపు పొడి వేసి 5 నిమిషాలు వేగించాలి. తర్వాత పెరుగు, గరం మసాలా, నిమ్మరసం వేసి చిన్న మంట మీద మరో 5 నిమిషాలు ఉడికించాలి. చివరగా గుడ్డు బజ్జీలు (రెండుగా మధ్యలో కోసుకుని) కూడా వేసి 2 నిమిషాలు ఉడికించి కొత్తిమీర జల్లి దించేయాలి.

Updated Date - 2017-02-25T19:05:27+05:30 IST