స్వీట్‌ అండ్‌ స్పైసీ ఫ్రూట్‌ సలాడ్‌

ABN , First Publish Date - 2018-01-27T22:17:01+05:30 IST

జామముక్కలు - 1/2 కప్పు, ఆపిల్‌ ముక్కలు- 1/2 కప్పు, దానిమ్మ గింజలు - 1/2 కప్పు, సీమరేగిపండు...

స్వీట్‌ అండ్‌ స్పైసీ ఫ్రూట్‌ సలాడ్‌

కావలసిన పదార్థాలు
 
జామముక్కలు - 1/2 కప్పు, ఆపిల్‌ ముక్కలు- 1/2 కప్పు, దానిమ్మ గింజలు - 1/2 కప్పు, సీమరేగిపండు ముక్కలు - 1/4 కప్పు, పండు ఖర్జూరం ముక్కలు - 1/4 కప్పు, నిమ్మరసం - 1 స్పూన్‌, తరిగిన వాల్‌నట్స్‌ - 1/4 కప్పు, ఉప్పు- చిటికెడు, తేనె - 1 టీ స్పూను, చాట్‌ మసాలా - కొద్దిగా, వైట్‌ పెప్పర్‌ - కొద్దిగా.
 
తయారుచేసే విధానం
 
ముక్కలుగా కోసిన పండ్లన్నీ ఒక గిన్నెలో వేసి, నిమ్మరసం కలపండి. దీనిలో తేనె, ఉప్పు, చాట్‌ మసాలా, వైట్‌ పెప్పర్‌ వేసి బాగా కలపండి. కప్స్‌లో వడ్డించే ముందు పైన తరిగిన వాల్‌నట్స్‌ చల్లండి. ఈ సలాడ్‌ను స్నాక్‌గా కానీ, భోజనం తర్వాత డెసెర్ట్‌గా కానీ తీసుకోవచ్చు.

Updated Date - 2018-01-27T22:17:01+05:30 IST