Abn logo

స్పైసీ చికెన్

కావలసిన పదార్థాలు
 
బోనలెస్‌ చికెన్ : కిలో, ఆవనూనె : ఐదు టేబుల్‌ స్పూన్, సోంపు : టీస్పూన్, వెల్లుల్లి తురుము : 2 టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయలు : నాలుగు, టమోటాలు : నాలుగు, అల్లం తురుము : టీ స్పూన్, పచ్చిమిర్చి : మూడు, కరివేపాకు : కొద్దిగా, టమోటా గుజ్జు : టేబుల్‌ స్పూన్, కారం : టేబుల్‌ స్పూన్, మిరియాల పొడి : టీ స్పూన్, జీలకర్ర పొడి : టీ స్పూన్, ఉప్పు : రుచికి సరిపడా, కొత్తిమీర తురుము : కొద్దిగా, పుదీనా : కొద్దిగా

తయారీ విధానం
 
బాణలిలో ఆవనూనె పోసి కాగాక సోంపు వేసి చిటపటమన్నాక వెల్లుల్లి తురుము వేసి వేయించాలి. ఉల్లి ముక్కలు, టమోటా ముక్కలు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు కరివేపాకు తురుము కూడా వేసి వేగాక చికెన ముక్కలు, టమోటా గుజ్జు వేసి కలపాలి. తరువాత ఉప్పు, కారం మిరియాలపొడి, జీలకర్ర పొడి వేసి సిమ్‌లో ఉడికించాలి. చివరగా దించే ముందు పుదీనా తురుము, కొత్తిమీర తురుము వేసి దించేయాలి. అంతే స్పైసీ చికెన కర్రీ రెడీ..

అందుబాటులోకి అన్ని బస్సు సర్వీస్‌లుజాతీయ ఉపకార వేతనాలకు 32 మంది ఎంపికఎన్టీఆర్‌ సేవలు మరువలేనివి సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలివైకుంఠధామాల నిర్మాణానికి అడ్డంకులుఈసారైనా పూర్తయ్యేనా..?‘రైతు సమస్యలు తెలుసుకుంటే ఉలికిపాటు దేనికి?’రేవంత్‌ అంటే ఎందుకు భయం?చెక్‌డ్యామ్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపనఅభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయండి
Advertisement
d_article_rhs_ad_1
Advertisement