Abn logo

రొయ్యల వేపుడు

కావలసినవి : రొయ్యలు - 200గ్రాములు, నిమ్మరసం - రెండు టీస్పూన్లు, నూనె - సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర టీస్పూన్‌, ఉప్పు - తగినంత, కారం - అర టీస్పూన్‌, గరంమసాలా - అర టీస్పూన్‌, ధనియాల పొడి - అర టీస్పూన్‌, యాలకులు - రెండు, జీలకర్ర - అర టీస్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, కరివేపాకు - కొద్దిగా, కొబ్బరి తురుము - ఒక టేబుల్‌స్పూన్‌.
 
తయారీ: రొయ్యలను శుభ్రంగా కడిగి అందులో అల్లంవెల్లుల్లి పేస్టు, కారం, గరంమసాలా, ధనియాల పొడి, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక జీలకర్ర, యాలకులు వేసి వేగించాలి. తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయాలి. మరికాసేపు వేగనివ్వాలి.ఇప్పుడు మసాలా పట్టించి పెట్టుకున్న రొయ్యలు వేసి కలపాలి. కాసేపు వేగిన తరువాత కొబ్బరి తురుము వేయాలి.కరివేపాకు వేసి చిన్న మంటపై ఉడికించుకోవాలి. వేడి వేడిగా అన్నంతో పాటు సర్వ్‌ చేసుకోవాలి.

బొమ్మిడాయిలు పాలకూరబోటీ చారు / దప్పడంకాళ్ల కూర / పాయతెలంగాణ చికెన్‌ కూరమామిడికాయతో చందమామ చేపల పులుసుషిడోల్‌ చేప కర్రీఫిష్‌ కర్రీచికెన్‌ మసాలా కర్రీతలకాయ కూరచికెన్‌ రోస్ట్‌
Advertisement
Advertisement