టొమాటోబాత్

ABN , First Publish Date - 2019-08-17T17:17:50+05:30 IST

బాస్మతి బియ్యం- ఒక కప్పు, నెయ్యి- ఒక స్పూన్‌, బిర్యానీ ఆకు - ఒకటి, లవంగాలు- 5, దాల్చినచెక్క- చిన్నముక్క, జీడిపప్పు- 10, ఉల్లిపాయ- 1, అల్లంవెల్లుల్లి పేస్టు- ఒక

టొమాటోబాత్

కావలసినవి
 
బాస్మతి బియ్యం- ఒక కప్పు, నెయ్యి- ఒక స్పూన్‌, బిర్యానీ ఆకు - ఒకటి, లవంగాలు- 5, దాల్చినచెక్క- చిన్నముక్క, జీడిపప్పు- 10, ఉల్లిపాయ- 1, అల్లంవెల్లుల్లి పేస్టు- ఒక స్పూన్‌, టొమాటోలు -2, పచ్చిమిర్చి- 1, క్యారెట్‌- 1, పచ్చి బఠాణీ- పావు కప్పు, బంగాళదుంప -1, బీన్స్‌- 5, కారం- అరస్పూన్‌, పసుపు- చిటికెడు, ఉప్పు- తగినంత, కొత్తిమీర - ఒకకట్ట, పుదీనా- ఒకకట్ట, నీళ్లు- ఒకటిన్నర కప్పు.
 
తయారీవిధానం
 
ముందుగా బియ్యం నానబెట్టుకోవాలి. కుక్కర్‌లో నెయ్యి వేసి ఉల్లిపాయలు వేగించాలి. ఠి తరువాత బిర్యానీ ఆకు, లవంగాలు, జీడిపప్పు వేయాలి. ఠి అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మరికాసేపు వేగించాలి. ఠి ఇప్పుడు టొమాటో, క్యారెట్‌, బంగాళదుంప ముక్కలు, బీన్స్‌, పచ్చి బఠాణీ వేసి వేగించాలి. ఠి పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసి మరికాసేపు వేగనివ్వాలి. ఠి నానబెట్టుకున్న బియ్యం వేసి తగినన్ని నీళ్లు పోసి కలపాలి. ఠి చిన్నమంటపై రెండు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించుకుంటే టొమాటో బాత్‌ రెడీ.

Updated Date - 2019-08-17T17:17:50+05:30 IST