కరివేపాకు రొయ్యలు
v id="pastingspan1">
కావలసినవి: రొయ్యలు, పసుపు, ఉప్పు, ఉల్లి, టొమాటో, పచ్చిమిర్చి, నూనె, కరివేపాకు
తయారీ విధానం: రొయ్యలను ముందుగా శుభ్రపరిచి పసుపు, ఉప్పుతో మరోమారు క్లీన్ చేయాలి. కేజీకి నలభై తూగే టైగర్ ప్రాన్ లాంటివి ఎంచుకోవాలి. ఉప్పు, పసుపుతో శుభ్రపరచడం వల్ల వాటి నుంచి వచ్చే వాసన పోతుంది. వాటిని నిమ్మరసం, ఉప్పు, పసుపు కలిపిన మిశ్రమంలో 40 నిమిషాలపాటు నానబెట్టి ఉంచాలి. కొంచెం ఉల్లి, టొమాటో, వెల్లుల్లి, గ్రీన్ చిల్లీని ముక్కలుగా తరిగి నూనెలో వేగించాలి. కరివేపాకు రొయ్యల వేపుడు కాబట్టి ఎక్కువ మోతాదులో కరివేపాకును నూనెలో వేగించాలి. తర్వాత రొయ్యల్ని అందులో వేసి కుకింగ్ ప్రారంభించాలి. పది నిమిషాల పాటు రొటేట్ చేస్తూ ఉండాలి. తీసే ముందు కాసేపు మూతపెట్టి ఉంచాలి. వడ్డించేందుకు సిద్ధమవుతుంది. వాటిని ప్లేటులో అందంగా పేర్చి ఉల్లి, టొమాటో ముక్కలు, కరివేపాకు చల్లితే అందంగా వుంటుంది.
కారం బదులు గ్రీన్ చిల్లీ తగినంత వేసుకుంటే సరిపోతుంది.