Abn logo

కార్న్‌ పకోడి

కావలసినవి
 
బేబీ కార్న్‌ - పది, సెనగపిండి - ముప్పావుకప్పు, పసుపు - పావుటీస్పూన్‌, కారం - అరటీస్పూన్‌, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా, ఛాట్‌మసాలా - కొద్దిగా, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒకటీస్పూన్‌, జీలకర్రపొడి - అరటీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌.
 
తయారీవిధానం
 
ముందుగా బేబీకార్న్‌ కండెలను మీడియం సైజు ముక్కలుగా కట్‌ చేయాలి. వాటిని నీళ్లలో కాసేపు ఉడికించాలి. తరువాత నీళ్లు తీసేసి కార్న్‌ పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో సెనగపిండి తీసుకొని పసుపు, కారం, ఉప్పు, అల్లంవెల్లుల్లిపేస్టు, జీలకర్రపొడి, ధనియాల పొడి, కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. మిశ్రమం చిక్కగా ఉండేలా చూసుకోవాలి. ఈ మిశ్రమంలో ఉడికించిన కార్న్‌ ముక్కలు వేసి బాగా కలియబెట్టాలి.
ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఈ కార్న్‌ ముక్కలు వేస్తూ డీప్‌ ఫ్రై చేయాలి.
ఛాట్‌ మసాలా చల్లుకుని సర్వ్‌ చేసుకోవాలి.

అంతుపట్టని వ్యూహంగందరగోళంగా వ్యవ‘సాయం’‘ఆదివాసీ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలి’పెన్‌గంగా ప్రాజెక్టు రైతులకు వరం లాంటిది : ఎమ్మెల్యేరాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై నిరసనఅభివృద్ధికి పునరంకితం కావాలితొలకరికే.. తొందర వద్దునేడే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలువిద్యార్థులు హాజరయ్యేలా చూడాలి‘పల్లె ప్రగతి’తో గ్రామాల అభివృద్ధి : ఎమ్మెల్యే రేఖ
Advertisement
d_article_rhs_ad_1
Advertisement