Abn logo

చాక్లెట్‌ పుడ్డింగ్‌

కావలసిన పదార్థాలు
 
చక్కెర - 2/3 కప్పులు, కార్న్‌ స్టార్చ్‌ - పావు కప్పు, ఉప్పు - పావు టీస్పూను, అన్‌స్టీటెన్డ్‌ కోకో పౌడర్‌ - 1/3 కప్పు, పాలు - 2 1/2 కప్పు, గుడ్డు పచ్చసొనలు - 4, అన్‌సాల్టెడ్‌ బటర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, వెనిల్లా ఎక్స్‌ట్రాక్ట్‌ - 1 టీస్పూను
 
తయారీవిధానం
చక్కెర, కార్న్‌స్టార్చ్‌, ఉప్పు కలిపి జల్లెడ పట్టాలి. కోకో పౌడర్‌ కలపాలి. వెడల్పాటి పాన్‌లో పాలు పోసి, జల్లెడ పట్టుకున్న పదార్థాలు పోయాలి. తర్వాత గుడ్ల సొన వేసి గిలక్కొట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీడియం ఫ్లేమ్‌ మీద ఉడికిస్తూ బాగా కలపాలి.
పెద్ద బుడగలు వచ్చి పగిలేవరకూ ఉడికించి, మంట తగ్గించాలి. అలా కలుపుతూనే ఒక నిమిషంపాటు ఉడికించాలి. ఈ హాట్‌ పుడ్డింగ్‌ను వడగటుకుని, దీన్లో బటర్‌, వెనిల్లా కలుపుకోవాలి. పుడ్డింగ్‌ నింపిన గిన్నె మీద గాలి చొరబడకుండా మూత పెట్టి, మూడు గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. సర్వ్‌ చేసే ముందు గరిటెతో కలపాలి.

పులి కోసం కొనసాగుతున్న గాలింపుమంచిర్యాలలో 420 కోళ్లు మృతి‘యువత క్రీడల్లో రాణించాలి’చిరుతపులి దాడిలో ఆవు మృతిముగిసిన నాన్‌ మహరాజ్‌ జాతరకవ్వాల్‌ అభయారణ్యంలో మంత్రి అల్లోలఘనంగా సంక్రాంతి సంబురాలునేటి నుంచి వ్యాక్సినేషన్‌ షురూ ముఖ్ర (కె) నిధులు రూ.కోటీ 41లక్షలుసైనికుల త్యాగాలను స్మరించుకోవాలి
Advertisement
Advertisement