బొప్పాయి పాయసం

ABN , First Publish Date - 2015-09-01T21:11:24+05:30 IST

కావలసినవి: ముగ్గిన బొప్పాయిలు 2 కేజీలు, చక్కెర అరకేజీ, నీరు ఒకటిన్నర కప్పు,

బొప్పాయి పాయసం

కావలసినవి: ముగ్గిన బొప్పాయిలు 2 కేజీలు, చక్కెర అరకేజీ, నీరు ఒకటిన్నర కప్పు, కొబ్బరికాయలు రెండు, యాలకులు 5, జీడిపపలు 15, కిస్‌మిస్‌ 10, నెయ్యి మూడు టేబుల్‌ స్పూన్లు.
ఎలా చేయాలి
బొప్పాయి పళ్లను చెక్కు తీసి, శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కోయాలి. ఒక బాణలిలో వాటిని వేసి కొద్దిగా నీళ్లు పోసి వేడి చేయాలి. తర్వాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరిని తురిమి మూడు విడతలుగా పాలు తయారు చేయాలి. తురుము నుంచి మొదట ఒక కప్పు పాలు తీయాలి. ఆ పిప్పి నుంచి మళ్లీ మూడు కపలు పాలు తీయాలి. మరో సారి కూడా ఆ పిప్పి నుంచి మూడు కప్పుల పాలు తీయాలి. ఈ పాలను విడి విడిగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత చక్కెరలో నీళ్లు పోసి వేడి చేయాలి. లేత పాకం వచ్చాక బొప్పాయి పళ్ల గుజ్జును, చివర్లో తీసిన మూడు కపల కొబ్బరి పాలను వేసి ఉడికించాలి. ఈ మిశ్రమం చిక్కబడిన తర్వాత రెండో సారి తీసిన కొబ్బరి పాలను వేసి బాగా కలపాలి. కొద్ది నిమిషాల తర్వాత మొదట తీసిన ఒక కప్పు కొబ్బరి పాలు పోసి బాగా కలపాలి. యాలకులను పొడి చేసి చల్లాలి. మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలిపి కిందికి దించాలి. నేతిలో వేగించిన జీడిపపలు, కిస్‌మిస్‌లతో అలంకరించాలి.

Updated Date - 2015-09-01T21:11:24+05:30 IST