అజ్వైని పనీర్‌ కోఫ్తా

ABN , First Publish Date - 2019-07-06T14:27:34+05:30 IST

జున్ను - 100గ్రా, చెస్ట్‌నట్‌ పిండి - 40గ్రా, ఉప్పు - రుచికి తగినంత, టొమాటో ప్యూరీ - 200గ్రా, వాము

అజ్వైని పనీర్‌ కోఫ్తా

కావలసినవి
 
జున్ను - 100గ్రా, చెస్ట్‌నట్‌ పిండి - 40గ్రా, ఉప్పు - రుచికి తగినంత, టొమాటో ప్యూరీ - 200గ్రా, వాము - 5గ్రా, కారం - 20గ్రా, ధనియాల పొడి - 10గ్రా, నూనె - తగినంత, కొత్తిమీర ఒక కట్ట.
తయారీవిధానం
 
పిండిలో జున్ను వేసి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. చిన్న చిన్న ఉండలుగా చేసుకొని నూనెలో వేసి వేగించి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక వాము వేయాలి. టోమాటో ప్యూరీ వేసి ఐదు నిమిషాల పాటు వేగించాలి.
కారం, ధనియాలపొడి, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. వేగించిన కోఫ్తాలు వేసి, కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకొని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-07-06T14:27:34+05:30 IST