గ్రీన్‌పీస్‌ కబాబ్‌

ABN , First Publish Date - 2019-07-13T20:25:19+05:30 IST

పాలకూర - 500గ్రాములు, పచ్చి బఠాణీ - 500గ్రాములు, పచ్చిమిర్చి - రెండు, అల్లం - ఒక చిన్నముక్క, ఉప్పు

గ్రీన్‌పీస్‌ కబాబ్‌

కావలసినవి
 
పాలకూర - 500గ్రాములు, పచ్చి బఠాణీ - 500గ్రాములు, పచ్చిమిర్చి - రెండు, అల్లం - ఒక చిన్నముక్క, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - పావు టీస్పూన్‌, బ్రెడ్‌ ముక్కలు - రెండు, సెనగపిండి - కొద్దిగా, నూనె - సరిపడా, ఉల్లిపాయ - ఒకటి.
 
తయారీవిధానం
ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి, కట్‌ చేసి పెట్టుకోవాలి. పచ్చి బఠాణీలను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో బఠాణీలు, పాలకూర, అల్లం, పచ్చిమిర్చి, బ్రెడ్‌ముక్కలు వేసి గ్రైండ్‌ చేసి ప్యూరీ తయారు చేసుకోవాలి. అందులో మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక మిశమ్రాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ సెనగపిండిలో అద్దుతూ నూనెలో వేసి వేగించాలి. ఉల్లిపాయలతో గార్నిష్‌ చేసుకొని వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-07-13T20:25:19+05:30 IST