సేమ్యా పులావ్‌

ABN , First Publish Date - 2019-06-15T21:41:34+05:30 IST

సేమ్యా - రెండు కప్పులు, ఉల్లిపాయ - ఒకటి, క్యారెట్‌ - ఒకటి, బీన్స్‌ - ఐదు, బంగాళదుంప

సేమ్యా పులావ్‌

కావలసినవి
 
సేమ్యా - రెండు కప్పులు, ఉల్లిపాయ - ఒకటి, క్యారెట్‌ - ఒకటి, బీన్స్‌ - ఐదు, బంగాళదుంప - ఒకటి, పుదీనా - ఒకకట్ట, పచ్చి బఠానీలు - కొన్ని, కొత్తిమీర - ఒక కట్ట, లవంగాలు - రెండు, దాల్చిన చెక్క - చిన్న ముక్క, యాలకులు - రెండు, నూనె - ఒక టేబుల్‌స్పూన్‌, నెయ్యి - టేబుల్‌స్పూన్‌, ఉప్పు - తగినంత, కొబ్బరి తురుము - రెండు టేబుల్‌స్పూన్లు, అల్లం ముక్క - కొద్దిగా, పచ్చిమిర్చి - రెండు, కొత్తిమీర - కొద్దిగా.
 
తయారీవిధానం
 
ముందుగా సేమ్యాను నెయ్యిలో వేగించి పెట్టుకోవాలి. కొబ్బరి తురుము, అల్లంముక్క, పచ్చిమిర్చి, కొత్తిమీరను మిక్సీలో వేసి పేస్టు మాదిరిగా చేయాలి. ఒక పాన్‌లో నూనె, కొద్దిగా నెయ్యి వేసి, కాస్త వేడి అయ్యాక జీలకర్ర వేయాలి. దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి కాసేపు వేగించాలి. ఉల్లిపాయలు వేయాలి. పుదీనా ఆకులు, మిక్సీలో పట్టి పెట్టుకున్న మిశ్రమం వేయాలి. క్యారెట్‌, బీన్స్‌, బంగాళదుంపలు వేసి కలియబెట్టాలి.
తరువాత సేమ్యా, పచ్చి బఠానీలు వేసి, కొద్దిగా వేడి నీళ్లు పోయాలి. కాసేపు ఉడికించుకొని కొత్తిమీర వేసి స్టవ్‌ పైనుంచి దింపుకోవాలి.

Updated Date - 2019-06-15T21:41:34+05:30 IST