చికెన్‌ సాటే

ABN , First Publish Date - 2019-12-28T17:59:51+05:30 IST

చికెన్‌ - పావుకిలోవవవ, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, పసుపు - చిటికెడు, సోయాసాస్‌

చికెన్‌ సాటే

కావలసిన పదార్థాలు: చికెన్‌ - పావుకిలోవవవ, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, పసుపు - చిటికెడు, సోయాసాస్‌ - ఒక టీస్పూన్‌, ఎండుమిర్చి పేస్టు - ఒక టీస్పూన్‌, నూనె - సరిపడా, నిమ్మకాయ - ఒకటి.
 
సాస్‌ కోసం : వేరుసెనగలు - ఒకకప్పు, ఉల్లిపాయ - ఒకటి, ఉప్పు - తగినంత, కొబ్బరిపాలు - ఒక కప్పు, బెల్లం - పావు కప్పు, నూనె - కొద్దిగా.
 
తయారీ విధానం: ముందుగా చికెన్‌ను ఒక పాత్రలోకి తీసుకుని శుభ్రంగా కడిగి అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, సోయాసాస్‌, ఎండుమిర్చి పేస్టు, నిమ్మరసం వేసి ముక్కలకు సమంగా పట్టేలా కలియబెట్టాలి. తరువాత చికెన్‌ ముక్కలను పుల్లకు గుచ్చి రెండు వైపులా కాల్చుకోవాలి. సాస్‌ కోసం వేరుసెనగలు వేగించి పొట్టు తీసి పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేసి ఉల్లిపాయలు వేసి వేగించాలి. తరువాత వేరుసెనగలు, ఎండుమిర్చి పేస్టు వేసి కలపాలి. బెల్లం, కొబ్బరిపాలు, తగినంత ఉప్పు వేసి మరికాసేపు వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి. చికెన్‌ ముక్కలను ఈ సాస్‌తో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటాయి.

Updated Date - 2019-12-28T17:59:51+05:30 IST