Abn logo

కుకుంబర్‌ ఛీజ్‌కేక్‌

కావలసినవి
 
సాల్ట్‌ బిస్కెట్లు - 175గ్రా, వెన్న - 50గ్రా, నిమ్మరసం - టీస్పూన్‌, మిరియాలు - టీస్పూన్‌, పన్నీర్‌ - 50గ్రా, కీర - ఒకటి, పెరుగు - పావు కేజీ, పంచదార - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, కోడిగుడ్లు - రెండు, నిమ్మరసం - రెండు టేబుల్‌స్పూన్లు, పుదీనా - కొద్దిగా, క్రీమ్‌ - 150 మి.లీ, వెల్లుల్లి - రెండు రెబ్బలు, ఉప్పు - రుచికి తగినంత.
 
తయారీవిధానం
 
బిస్కెట్లను పొడిగా చేసి అందులో వెన్న, నిమ్మరసం, పన్నీర్‌ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి పాత్ర అంతటా వచ్చేలా ఒత్తుకోవాలి.
ఇప్పుడు కీర ముక్కలు, పెరుగు వేసి బాగా కలియబెట్టాలి. కోడిగుడ్డు పసుపు భాగం, పంచదార, నిమ్మరసం, వెల్లుల్లి, పుదీనా ఆకులు, క్రీమ్‌ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెడల్పాటి పాత్రలో ఒత్తుకున్న మిశ్రమంపై లేయర్‌లా వేసుకోవాలి. ఫ్రిజ్‌లో పెట్టి, చల్లగా అయిన తరువాత తినాలి.

అగ్రిసెజ్‌ దిశగా అడుగులు రగడఆర్థిక సమస్యలతో దంపతుల ఆత్మహత్యా యత్నంఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించాలిజూన్‌ 2న ఆవిర్భావ వేడుకలురుణాలను సకాలంలో మంజూరు చేయాలి : కలెక్టర్‌ అందుబాటులోకి అన్ని బస్సు సర్వీస్‌లుజాతీయ ఉపకార వేతనాలకు 32 మంది ఎంపికఎన్టీఆర్‌ సేవలు మరువలేనివి సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
Advertisement
d_article_rhs_ad_1
Advertisement