కీరా పకోడి

ABN , First Publish Date - 2019-06-01T20:20:14+05:30 IST

చెస్ట్‌నట్‌ పిండి - కప్పు, దొడ్డు ఉప్పు - రెండు టీస్పూన్లు, కారం - అర టీస్పూన్‌, ధనియాల పొడి

కీరా పకోడి

కావలసినవి
 
చెస్ట్‌నట్‌ పిండి - కప్పు, దొడ్డు ఉప్పు - రెండు టీస్పూన్లు, కారం - అర టీస్పూన్‌, ధనియాల పొడి - అర టీస్పూన్‌, పచ్చి మిర్చి - రెండు(కట్‌ చేసుకోవాలి), కీర - రెండు, నూనె - తగినంత.
 
తయారీవిధానం
 
ఒక పాత్రలోకి పిండి తీసుకొని, తగినంత ఉప్పు, ధనియాల పొడి, కారం, పచ్చి మిర్చి వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు మరొక పాత్రలో నూనె పోసి వేడి చేసుకోవాలి. తరువాత కీర ముక్కలను ఆ మిశ్రమంలో అద్దుకుంటూ నూనెలో వేగించాలి. వీటిని కొత్తిమీర, చింతపండు చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.

Updated Date - 2019-06-01T20:20:14+05:30 IST