మసాలా ఛాస్‌

ABN , First Publish Date - 2019-05-18T20:18:51+05:30 IST

పెరుగు - రెండు కప్పులు, పచ్చి మిర్చి - రెండు, కొత్తిమీర - ఒక కట్ట, కరివేపాకు - కొద్దిగా, ఉప్పు - రుచికి తగినంత.

మసాలా ఛాస్‌

కావలసినవి
 
పెరుగు - రెండు కప్పులు, పచ్చి మిర్చి - రెండు, కొత్తిమీర - ఒక కట్ట, కరివేపాకు - కొద్దిగా, ఉప్పు - రుచికి తగినంత.
 
తయారీవిధానం
 
ముందుగా కొత్తిమీరను శుభ్రంగా కడిగి కట్‌ చేసి పెట్టుకోవాలి. పచ్చి మిర్చి కట్‌ చేసుకోవాలి. పెరుగు తీసుకొని అందులో పచ్చి మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. మిక్సీలో తక్కువ స్పీడ్‌తో బ్లెండ్‌ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకొని, రెండు కప్పుల చల్లటి నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి.
దీన్ని చల్లబడే వరకు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఛాట్‌ మసాలా చల్లుకుని సర్వ్‌ చేస్తే బాగుంటుంది.

Updated Date - 2019-05-18T20:18:51+05:30 IST