సత్తు షర్బత్‌

ABN , First Publish Date - 2019-05-18T20:17:44+05:30 IST

సెనగపిండి - పావు కప్పు, నీళ్లు - నాలుగు కప్పులు, నిమ్మరసం - రెండు టీస్పూన్‌లు, జీలకర్ర - అరటీస్పూన్‌, పుదీనా - ఒక కట్ట, పచ్చిమిర్చి - ఒకటి, పచ్చి మామిడికాయ

సత్తు షర్బత్‌

కావలసినవి
 
సెనగపిండి - పావు కప్పు, నీళ్లు - నాలుగు కప్పులు, నిమ్మరసం - రెండు టీస్పూన్‌లు, జీలకర్ర - అరటీస్పూన్‌, పుదీనా - ఒక కట్ట, పచ్చిమిర్చి - ఒకటి, పచ్చి మామిడికాయ - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత.
తయారీవిధానం
ముందుగా జీలకర్రను వేయించుకోవాలి. పుదీనాను కట్‌ చేసుకోవాలి. మామిడికాయ సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో అన్ని పదార్థాలు వేయాలి. నీళ్లు పోసి బాగా కలియబెట్టాలి. చల్లగా కావాలనుకుంటే ఐస్‌ముక్కలు వేసుకోవచ్చు. పుదీనా ఆకులతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేస్తే వెరైటీగా ఉంటుంది.

Updated Date - 2019-05-18T20:17:44+05:30 IST