స్టఫ్డ్‌ మష్రూమ్స్‌

కావలసినవి
 
పుట్టగొడుగులు - 250గ్రాములు(పెద్దసైజువి, కాడ ఉన్నవి), అల్లం పేస్టు - రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ - ఒకటి, మిరియాల పొడి - అర టీస్పూన్‌, కొత్తిమీర - ఒక కట్ట, జున్ను - అరకప్పు, వెన్న - ఒక టేబుల్‌స్పూన్‌.
 
తయారీవిధానం
 
పుట్టగొడుగులను శుభ్రంగా కడిగి కాడలు(తొడిమెలు) తొలగించాలి. ఒక పాన్‌ తీసుకొని కొద్దిగా వెన్న వేసి ఉల్లిపాయ, అల్లం పేస్టు వేసి వేగించాలి. కాసేపు వేగిన తరువాత ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకొని దింపుకోవాలి. చల్లారిన తరువాత జున్ను, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలపాలి. ఈ స్టఫ్‌ను కాడలు తీసిన పుట్టగొడుగుల్లో కూరాలి. తరువాత ఓవెన్‌లో ఉడికించుకుని సర్వ్‌ చేసుకోవాలి.

కరోనా సమయంలో దాతలు సహాయం అందించాలి ప్రైవేటు ఆస్పత్రుల్లో భారీ దోపిడీపకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలుసీసీ రోడ్డుపైనే బీటీ రోడ్డు నిర్మాణంపైకప్పు కూలినా.. పట్టింపు కరువుహెల్మెట్‌ ధరిస్తేనే రోడ్లపైకి అనుమతి : సీఐమూడు దశాబ్దాల సమస్యకు పరిష్కారం!కమ్ముకుంటున్న కారుమబ్బులువానాకాలం సాగుకు రైతులు సన్నద్ధంనత్తనడకన బావి నిర్మాణ పనులు
Advertisement
Advertisement