బాదం పాక్‌

ABN , First Publish Date - 2015-08-30T23:05:41+05:30 IST

కావలసినవి: బాదం పప్పులు 500 గ్రా., నెయ్యి 300 గ్రా., చక్కెర 400 గ్రా., నీళ్ళు 200 మి.లీ., యాలకుల పొడి కొంచెం.

బాదం పాక్‌

కావలసినవి: బాదం పప్పులు 500 గ్రా., నెయ్యి 300 గ్రా., చక్కెర 400 గ్రా., నీళ్ళు 200 మి.లీ., యాలకుల పొడి కొంచెం.
తయారుచేసే విధానం
ముందుగా బాదం పపుల్ని వేడినీళ్ళలో వేసి అరగంటసేపు ఉంచాలి. తొక్క ఉబ్బినట్టు కనిపించగానే రెండు అరచేతుల మధ్యపెట్టి నలిపితే ఊడి వస్తుంది. ఈ పప్పుల్లో కొంచెం నీళ్ళుపోసి మిక్సీలో మెత్తటి ముద్దలా చేసి ఉంచుకోవాలి. కడాయిలో నెయ్యి వేశాక ఈ ముద్ద వేసి లైట్‌ బ్రౌన్‌ రంగు వచ్చేదాకా వేగించి పక్కన పెట్టుకోవాలి. వేరే కడాయిలో చక్కెర, నీళ్ళు వేసి లేత పాకం పట్టాలి. ఈ పాకంలో బాదం ముద్ద, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. నెయ్యి రాసిన పళ్ళెంలో ఈ మిశ్రమం వేసి చల్లారనివ్వాలి. తర్వాత కావాల్సిన ఆకారంలో కట్‌ చేసుకోవాలి.

Updated Date - 2015-08-30T23:05:41+05:30 IST