వెజిటబుల్‌ సలాడ్‌

ABN , First Publish Date - 2019-09-28T18:43:23+05:30 IST

బంగాళదుంప, క్యారెట్‌, క్యాలీఫ్లవర్‌, ఫ్రెంచ్‌ బీన్స్‌ - అన్నీ కలిపి నాలుగు కప్పులు, ఉల్లిపాయలు - రెండు, నూనె - తగినంత, యాలకులు - నాలుగు, లవంగాలు..

వెజిటబుల్‌ సలాడ్‌

కావలసినవి
 
బంగాళదుంప, క్యారెట్‌, క్యాలీఫ్లవర్‌, ఫ్రెంచ్‌ బీన్స్‌ - అన్నీ కలిపి నాలుగు కప్పులు, ఉల్లిపాయలు - రెండు, నూనె - తగినంత, యాలకులు - నాలుగు, లవంగాలు - నాలుగు, దాల్చిన చెక్క - చిన్నముక్క, పచ్చిమిర్చి - రెండు, అల్లం - చిన్నముక్క, మిరియాల పొడి - అర టీస్పూన్‌, కొబ్బరిపాలు - రెండు కప్పులు, కరివేపాకు - ఒక కట్ట, ఉప్పు - సరిపడా.
 
తయారీవిధానం
 
ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క వేసి వేగించాలి. పచ్చిమిర్చి, అల్లం, తరిగిన ఉల్లిపాయలు వేసి మరో రెండు నిమిషాల పాటు వేగించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, కట్‌ చేసి పెట్టుకున్న కూరగాయల ముక్కలు వేసి, తగినంత ఉప్పు, నీళ్లు పోసి పావుగంటపాటు చిన్నమంటపై ఉడికించాలి. చివరగా కొబ్బరి పాలు పోసి చిన్నమంటపై ఒక నిమిషంపాటు ఉడికించుకుని దింపుకోవాలి.

Updated Date - 2019-09-28T18:43:23+05:30 IST