నువ్వుల పచ్చి పులుసు

ABN , First Publish Date - 2015-09-02T20:35:16+05:30 IST

కావలసిన పదార్థాలు: నువ్వులు - 2 టేబుల్‌ స్పూన్లు, చింతపండు - నిమ్మకాయంత, పంచదార - 1 టీ స్పూను

నువ్వుల పచ్చి పులుసు

కావలసిన పదార్థాలు: నువ్వులు - 2 టేబుల్‌ స్పూన్లు, చింతపండు - నిమ్మకాయంత, పంచదార - 1 టీ స్పూను, నీరు - ఒకటిన్నర కప్పు, పచ్చిమిర్చి - 2, ఉల్లి తరుగు - అరకప్పు, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర - 1 కట్ట, కరివేపాకు - 4 రెబ్బలు, పసుపు, ఆవాలు, జీలకర్ర, నూనె - పోపుకు సరిపడా.
తయారుచేసే విధానం: నువ్వుల్ని వేగించాలి. పచ్చిమిర్చిని మంటపై కాల్చి చల్లారిన తర్వాత ఉప్పు, నువ్వులతో పాటు బరకగా మిక్సీ వేసుకోవాలి. నానబెట్టి రసం తీసిన చింతపండులో నీరు, నువ్వుల మిశ్రమం, ఉల్లితరుగు, ఉప్పు, పంచదార, కొత్తిమీర తరుగు కలపాలి. తాలింపు కలిపి ఫ్రిజ్‌లో గంటసేపుంచి అన్నంలో కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-09-02T20:35:16+05:30 IST