బేబీకార్న్‌ మంచూరియా

ABN , First Publish Date - 2015-08-26T22:03:03+05:30 IST

కావలసిన పదార్థాలు: బేబీ కార్న్‌ - 12, క్యారెట్‌ - 1, క్యాప్సికం - 1, ఉల్లిపాయ - 1, మైదా - 4 టేబుల్‌ స్పూన్లు, నూనె - తగినంత

బేబీకార్న్‌ మంచూరియా

కావలసిన పదార్థాలు
 
బేబీ కార్న్‌ - 12, క్యారెట్‌ - 1, క్యాప్సికం - 1, ఉల్లిపాయ - 1, మైదా - 4 టేబుల్‌ స్పూన్లు, నూనె - తగినంత, అల్లం, వెల్లుల్లి పేస్టు - 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి - 3, స్ర్పింగ్‌ ఆనియన్స్‌ - అరకప్పు, జీరాపొడి, మిరియాలపొడి, ఉప్పు - రుచికి తగినంత.
సాస్‌ కోసం: అల్లం రసం, సోయా సాస్‌ - ఒకటిన్నర స్పూను చొప్పున, స్వీట్‌కార్న్‌ సాస్‌ - పావు కప్పు, పంచదార - అర టీ స్పూను, వెనిగర్‌ - 1 టీ స్పూను, మిరియాలపొడి - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, కార్న్‌ఫ్లోర్‌ - 2 టీ స్పూన్లు (పావు కప్పు నీటిలో కరిగించాలి)
 
తయారుచేసే విధానం
 
అంగుళం పొడవున కట్‌ చేసి ఉడికించిన బేబీ కార్న్‌ ముక్కల్లో ఉప్పు, కారం, సగం అల్లం వెల్లుల్లి పేస్టు, మైదా వేసి తగినంత నీరుపోస్తూ ముక్కలకు బాగా పట్టేలా చిక్కగా కలిపి నూనెలో దోరగా వేగించి పక్కనుంచాలి. 2 టేబుల్‌ స్పూన్ల నూనెలో ఉల్లి, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, క్యాప్సికం వేగించి కారం, ఉప్పు, సాస్‌లు వేసి పెద్దమంటపై ఒక నిమిషం వేగించాలి. ఇప్పుడు వేగించిన బేబీకార్న్‌ కలిపి నిమిషం తర్వాత స్ర్పింగ్‌ ఆనియన్స్‌, నీటిలో కరిగిన కార్న్‌ఫ్లోర్‌ చల్లాలి. ముక్కలకు గ్రేవీ బాగా పట్టిన తర్వాత దించేసి కొత్తిమీర తో అలంకరించుకోవాలి.

Updated Date - 2015-08-26T22:03:03+05:30 IST