తీపి పొంగలి

ABN , First Publish Date - 2015-09-03T18:38:57+05:30 IST

కావలసిన పదార్థాలు: బియ్యం - 1 కప్పు, పెసరపప్పు - పావు కప్పు, పాలు - అర కప్పు,

తీపి పొంగలి

కావలసిన పదార్థాలు: బియ్యం - 1 కప్పు, పెసరపప్పు - పావు కప్పు, పాలు - అర కప్పు, నెయ్యి - అర కప్పు, జీడిపప్పు - పావు కప్పు, కిస్‌మిస్‌ - పావు కప్పు, యాలకులు - 4, బెల్లం - ఒకటిన్నర కప్పు.
తయారుచేసే విధానం: పెసరపప్పును దోరగా వేగించి బియ్యంతో పాటు పావుగంట నానబెట్టాలి. తర్వాత అందులో తగినంత నీరుతో పాటు పావు కప్పు నెయ్యి, పాలు కలిపి మెత్తగా ఉడికించాలి. మరో కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌, యాలకులు వేగించి పక్కనుంచాలి. ఒక పాత్రలో ముక్కలు చేసిన బెల్లంతో పాటు తగినంత నీరు పోసి ఉడికించాలి. బెల్లం ఉండలు లేకుండా కరిగి, మసలుతున్నప్పుడు అన్నం పెసరపప్పు మిశ్రమం, జీడిపప్పు, కిస్‌మిస్‌, యాలకులు కలిపి దించేయాలి.

Updated Date - 2015-09-03T18:38:57+05:30 IST