కాలీ ఫ్లవర్ మంచూరియా

ABN , First Publish Date - 2017-01-07T17:31:32+05:30 IST

కావలసిన పదార్థాలు బ్యాచ్‌ 1: బ్రకొలి - అర కిలో, మైదా - 2 టే.స్పూన్లు

కాలీ ఫ్లవర్ మంచూరియా

కావలసిన పదార్థాలు
బ్యాచ్‌ 1: కాలీ ఫ్లవర్ - అర కిలో, మైదా - 2 టే.స్పూన్లు
కార్న్‌ ఫ్లోర్‌ - ఒకటిన్నర కప్పులు, కారం - 1 టే.స్పూను
ఉప్పు - 1 టీస్పూను, మిరియాల పొడి - 1 టీస్పూను
నీళ్లు - ఒకటిన్నర కప్పు
బ్యాచ్‌ 2: వెల్లుల్లి - 4 (సన్నగా తరగాలి), అల్లం - అంగుళం ముక్క, టమాటా సాస్‌ - 3 టే.స్పూన్లు, చిల్లీ సాస్‌ - 1 టే.స్పూను
సోయా సాస్‌ - 3 టే.స్పూన్లు, అజినమొటో - 1 టీస్పూను

నూనె - తగినంత
తయారీ విధానం
కాలీ ఫ్లవర్ మినహా బ్యాచ్‌ 1లోని ఇంగ్రిడియెంట్స్‌ అన్నీ కలిపి చిక్కని పిండిలా కలుపుకోవాలి. పిండి బజ్జీల పిండిలా ఉండాలి.
ఈ పిండిలో కాలీ ఫ్లవర్ ముక్కలు ముంచి నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి.
బాండీలో నూనె పోసి సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి.
తర్వాత టమాట, చిల్లీ, సోయా సాస్‌లు, అజినమొటో వేసి బాగా కలపాలి.
చివరిగా వేయించిన బ్రకొలి వేసి 2 ని.లు వేయించి తీయండి.
తరిగిన స్ర్పింగ్‌ ఆనియన్‌తో అలంకరించి సర్వ్‌ చేయాలి.

Updated Date - 2017-01-07T17:31:32+05:30 IST