టొర్పెండో పెప్పర్‌

ABN , First Publish Date - 2016-12-31T14:09:10+05:30 IST

క్యాప్సికమ్‌ - పది గ్రాములు, తులసి ఆకులు - పది గ్రాములు, అమూల్‌చీజ్‌ - వందగ్రాములు, సాలన్‌ మిర్చి - ఆరు, నూనె - వేగించడానికి సరిపడా, మైదా - 50 గ్రాములు, ఆవాల గుజ్జు

టొర్పెండో పెప్పర్‌

కావలసినవి: క్యాప్సికమ్‌ - పది గ్రాములు, తులసి ఆకులు - పది గ్రాములు, అమూల్‌చీజ్‌ - వందగ్రాములు, సాలన్‌ మిర్చి - ఆరు, నూనె - వేగించడానికి సరిపడా, మైదా - 50 గ్రాములు, ఆవాల గుజ్జు - ఐదు గ్రాములు, కార్న్‌ఫ్లేక్స్‌ - వందగ్రాములు, మొక్కజొన్న పిండి - కొద్దిగా, టొమాటో సల్సా, పులిసిన మీగడ - ఒక్కోటి 50 గ్రాముల చొప్పున.
 
తయారీ: సాలన్‌ మిర్చి, క్యాప్సికమ్‌లను శుభ్రంగా కడిగి గింజలు తీసేయాలి. వాటిలో చీజ్‌ను కూరాలి. మైదా, మొక్కజొన్నపిండి, ఆవాల గుజ్జు, ఉప్పు, చల్లటినీళ్లు కలిపి జారు పిండిలా కలపాలి. మైదాలో స్టఫ్‌ చేసిన మిర్చిలను దొర్లించాలి. తరువాత కలిపిన పిండిలో ముంచి కార్న్‌ఫ్లేక్స్‌లో దొర్లించాలి. వేడివేడిగా సాల్సా, పుల్లటి మీగడలతో కలిపి తింటే రుచిగా ఉంటుంది.

Updated Date - 2016-12-31T14:09:10+05:30 IST