మామిడి-ములక్కాడ పులుసు

ABN , First Publish Date - 2015-12-05T16:26:12+05:30 IST

కావలసిన పదార్థాలు: మామిడికాయలు - రెండు, ములక్కాడలు - నాలుగు, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిరపకాయలు - ఐదు, ఆవాలు, జీలకర్ర - ఒక టీ స్పూను, కరివేపాకు -

మామిడి-ములక్కాడ పులుసు

కావలసిన పదార్థాలు: మామిడికాయలు - రెండు, ములక్కాడలు - నాలుగు, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిరపకాయలు - ఐదు, ఆవాలు, జీలకర్ర - ఒక టీ స్పూను, కరివేపాకు - రెండు రెబ్బలు, వెల్లుల్లి రేకలు - నాలుగు, కారం - రెండు టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారు చేయు విధానం: మామిడికాయల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. ములక్కాడలను కావాల్సిన సైజులో ముక్కలు కోసి పెట్టుకోవాలి. ఉల్లిపాయల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోయాలి. బాగా కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిరేకలు వేయాలి. తరువాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. తరువాత ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. ఇప్పుడు ములక్కాడ ముక్కలు కూడా వేసి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత మామిడికాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు రెండు గ్లాసుల నీళ్లు పోసి ఓ పదినిమిషాలు పులుసుని మరిగించాలి. ముక్కలు బాగా మెత్తబడ్డాక దించేయాలి.

Updated Date - 2015-12-05T16:26:12+05:30 IST