వంకాయ ఊరగాయ

ABN , First Publish Date - 2015-12-03T16:37:03+05:30 IST

కావాల్సిన పదార్థాలు: వంకాయలు - పావుకిలో, ఆవపిండి - 150 గ్రాములు, కారం - 150 గ్రాములు, ఉప్పు - 150 గ్రాములు, చింతపండు - 50 గ్రాములు, మెంతిపిండి - ఒక టీ

వంకాయ ఊరగాయ

కావాల్సిన పదార్థాలు: వంకాయలు - పావుకిలో, ఆవపిండి - 150 గ్రాములు, కారం - 150 గ్రాములు, ఉప్పు - 150 గ్రాములు, చింతపండు - 50 గ్రాములు, మెంతిపిండి - ఒక టీ స్పూను, పసుపు - అర టీ స్పూను, ఇంగువ - చిటికెడు.
తయారుచేయు విధానం: ముందుగా వంకాయల్ని మనకి కావాల్సిన సైజులో ముక్కలు కోసుకోవాలి. స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి కొద్దిగా నూనెపోసి కాగాక ఈ ముక్కల్ని వేసి కొద్దిగా మగ్గనిచ్చి దించుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి కాగాక ఇంగువ వేసి దింపేయాలి. చింతపండుని ఉడికించి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో ఆవపిండి, కారం, ఉప్ప, మెంతిపిండి, పసుపు వేసి బాగా కులపుకుని చింతపండు గుజ్జు, వంకాయ ముక్కలు, కాచిన నూనె వేసి కలుపుకోవాలి. దీన్ని గాజుసీసాలో పెట్టాలి. మిగిలిన నూనెని పచ్చడిపై పోసుకోవాలి. అంతే వంకాయ ఆవకాయ తయారయినట్టే. ఇలా చేసిన వంకాయ ఆవకాయ నెల రోజుల వరకూ పాడవకుండా ఉంటుంది.

Updated Date - 2015-12-03T16:37:03+05:30 IST