టొమోట పచ్చడి

ABN , First Publish Date - 2015-12-03T16:27:46+05:30 IST

కావాల్సినపదార్థాలు: టొమోటాలు - అరకిలో, పచ్చిమిరపకాయలు - పది, వెల్లుల్లి రేకలు - ఆరు, జీలకర్ర - అరటీ స్పూను, చింతపండు - కొద్దిగా, కొత్తిమీర - రెండు కట్టలు, మినపప్పు

టొమోట పచ్చడి

కావాల్సినపదార్థాలు: టొమోటాలు - అరకిలో, పచ్చిమిరపకాయలు - పది, వెల్లుల్లి రేకలు - ఆరు, జీలకర్ర - అరటీ స్పూను, చింతపండు - కొద్దిగా, కొత్తిమీర - రెండు కట్టలు, మినపప్పు - రెండు టీ స్పూన్లు, కరివేపాకు - రెండు రెబ్బలు, పసుపు - చిటికెడు, నువ్వులు - ఒక టేబుల్‌ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - తగినంత.
తయారుచేయు విధానం: ముందు స్టౌ వెలిగించి కడాయిలో నువ్వుల్ని దోరగా వేయించి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నూనె వేసి బాగా వేడెక్కాక జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి రేకలు, టొమోట ముక్కలు, చింతపండు, కొత్తిమీర, పసుపు, ఉప్పు వేసి బాగా దగ్గరగా మగ్గనివ్వాలి. చల్లారిన తరువాత వేయించి పెట్టుకున్న నువ్వులను ఇందులో కలుపుకుని రోట్లో రుబ్బుకోవాలి. ఇలా రుబ్బిన పచ్చడిని పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద గిన్నె పెట్టి సరిపడా నూనె వేసి కాగాక మినపప్పు వేసి వేయించాలి. ఎర్రగా వేగాక కరివేపాకు కూడా వేయాలి. ఈ తాలింపుని పచ్చడిలో కలుపుకోవాలి.

Updated Date - 2015-12-03T16:27:46+05:30 IST