Abn logo

బీట్‌రూట్‌ మంచూరియా

కావలసిన పదార్థాలు: బీట్‌రూట్‌ పావు కేజీ, కార్న్‌ ఫ్లోర్‌ 1 కప్పు, ఉప్పు తగినంత, గరంమసాలా 1 టీ స్పూన్‌ , పచ్చి మిరపకాయలు నాలుగు, ఉల్లిపాయలు అర కప్పు, మిరియాలు 1 టీ స్పూన్‌, అల్లం వెల్లుల్లి మిశ్రమం 1 టీ స్పూన్‌, కొత్తిమీర ఒక కట్ట, సోయాసాస్‌ 1 టేబుల్‌ స్పూన్‌, చిల్లీ సాస్‌ 1/2 టేబుల్‌ స్పూన్‌, టమోటా సాస్‌ 1 టేబుల్‌ స్పూన్‌, సాజీర 1/2 టీ స్పూన్‌, నూనె తగినంత.
తయారుచేయు విధానం: ముందుగా బీట్‌రూట్‌ను సన్నగా తురుముకోవాలి. పచ్చి మిరపకాయలను శుభ్రంగా కడుక్కుని కట్‌ చేసుకోవాలి. తర్వాత కార్న్‌ఫ్లోర్‌, ఉప్పు, గరంమసాలా, పచ్చి మిర్చి ముక్కలను సన్నగా తురుముకున్న బీట్‌రూట్‌కు కలిపి ఉండలుగా చేసుకోవాలి. వీటిని డీప్‌ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నెలో నూనె తీసుకుని కాస్త వేడి అయ్యాక సాజీర, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి మిశ్రమం, మిరియాలు, ఉప్పు, సోయాసాస్‌, చిల్లీ సాస్‌, టమోటా సాస్‌ వేసుకోవాలి. ఈ మిశ్రమం బాగా మరిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బీట్‌రూట్‌ ఉండలను ఇందులో వేసుకోవాలి. పైన కొంచెం గరం మసాలా చల్లుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకోవాలి. అంతే బీట్‌రూట్‌ మంచూరియా రెడీ.

పల్లెలకు ‘ప్రకృతి’ శోభమంచిర్యాల కలెక్టర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులునిర్మల్‌లో రెండు సింహాల సంచారం?బాధిత కుటుంబాలకు పరామర్శ ‘ఎస్సీ, ఎస్టీ చట్టాల అమలులో నిర్లక్ష్యం’ బీడీ కార్మికులకు పని దినాలు పెంచండి రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : మున్సిపల్‌ చైర్మన్‌నర్సరీని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌కడెం అడవుల్లో పర్యటించిన జడ్పీ చైర్మన్‌
Advertisement
Advertisement