అంజీర్‌ కా మీఠా

ABN , First Publish Date - 2016-09-07T20:35:05+05:30 IST

కావలసిన పదార్ధాలు: ఎండు అంజీరాలు - కిలో, పాలు - అరలీటర్‌, పంచదార - అరకిలో, నెయ్యి - 200 గ్రా, కోవా - 200 గ్రా, యాలకుల పొడి - టీ స్పూన, బాదం, జీడిపప్పు, పిస్తా - అలంకరణకు సరిపడా.

అంజీర్‌ కా మీఠా

కావలసిన పదార్ధాలు: ఎండు అంజీరాలు - కిలో, పాలు - అరలీటర్‌, పంచదార - అరకిలో, నెయ్యి - 200 గ్రా, కోవా - 200 గ్రా, యాలకుల పొడి - టీ స్పూన, బాదం, జీడిపప్పు, పిస్తా - అలంకరణకు సరిపడా.

తయారీ పద్ధతి:
అంజీరాల్ని బాగా కడగాలి. గిన్నెలో పాలు పోసి మరిగించి దించాలి. కడిగిన అంజీర్‌ పండ్లను చిన్న చిన్న ముక్కలుగా చేసి పాలల్లో వేసి సుమారు 20 నిమిషాల పాటు నాననివ్వాలి. ఆ తరువాత ఈ మొత్తాన్ని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. తరువాత ఈ మిశ్రమాన్ని కోవాతో కలపాలి.
బాణలిలో నెయ్యి వేసి కోవా మిశ్రమాన్ని సిమ్‌లో సుమారు అరగంటసేపు కలుపుతూ ఉడికించాలి. అందులోనే పంచదారవేసి మరో పది నిమిషాలపాటు కలుపుతూ ఉండాలి. మిశ్రమం దగ్గరగా అయిన తరువాత నెయ్యి రాసిన ప్లేటులో వేసి బాదం, జీడిపప్పు, పిస్తా పప్పులతో అలంకరించి ఆరాక ముక్కలుగా కోస్తే సరి.

Updated Date - 2016-09-07T20:35:05+05:30 IST