అనప పచ్చడి

ABN , First Publish Date - 2016-07-17T21:53:13+05:30 IST

కావలసిన పదార్థాలు: సొరకాయ ముక్కలు- 1 కప్పు, కొబ్బరి ముక్కలు- 1/2 కప్పు, చింతపండు- ఉసిరికాయంత, ఎండుమిర్చి- 4, వెల్లుల్లి రేకలు- 4, జీలకర్ర- 1/4 టీ స్పూను, తాలింపుదినుసులు- 1 టీ స్పూను,

అనప పచ్చడి

కావలసిన పదార్థాలు: సొరకాయ ముక్కలు- 1 కప్పు, కొబ్బరి ముక్కలు- 1/2 కప్పు, చింతపండు- ఉసిరికాయంత, ఎండుమిర్చి- 4, వెల్లుల్లి రేకలు- 4, జీలకర్ర- 1/4 టీ స్పూను, తాలింపుదినుసులు- 1 టీ స్పూను, ఉప్పు- రుచికి తగినంత, నూనె- 2 టీ స్పూన్లు, శెనగపప్పు- 1 టీ స్పూను, నువ్వులు- 1 టీ స్పూను, సాయిమినపప్పు- 1 టీ స్పూను

తయారీ విధానం:
ముందుగా సొరకాయ ముక్కలను పావు కప్పు నీళ్ళు పోసి ఒక విజిల్‌ వచ్చేవరకూ కుక్కర్‌లో ఉడికించుకోవాలి. తరువాత ఒక బాణలిలో టీ స్పూను నూనె వేసి శెనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, నువ్వులను దోరగా వేగించుకోవాలి. ఆ తరువాత వాటిని చల్లార్చి మెత్తగా మిక్సీ పట్టాక చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర కూడా వేసి రుబ్బాలి. తరువాత కొబ్బరి ముక్కలు, సొరకాయ ముక్కలు కూడా వేసి రుబ్బి తాలింపు పెట్టుకోవాలి.

Updated Date - 2016-07-17T21:53:13+05:30 IST