Abn logo

శనగపప్పు స్వీట్‌

కావ

లసిన పదార్థాలు: శనగపప్పు - అర కప్పు, (1టేబుల్‌ స్పూను నూనె కలిపిన ) నీరు - అరకప్పు, పాలు - అరకప్పు, నూనె - 1 టేబుల్‌ స్పూను, వెన్న - 2 టేబుల్‌ స్పూన్లు, యాలకులపొడి - 1 టీ స్పూను, పంచదార - అరకప్పు, మిల్క్‌పౌడర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, పిస్తా ముక్కలు - అరకప్పు.
తయారుచేసే విధానం: నూనె కలిపిన నీటిలో శనగపప్పుని ఒక రాత్రంతా నానబెట్టి, ఆ నీళ్లతోనే ఉడికించి చేత్తో మెదపాలి. కడాయిలో నూనె, ఒక టేబుల్‌ స్పూను వెన్న వేసి నిమిషం తర్వాత మెదిపిన పప్పు, పాలు, యాలకులపొడి కలిపి అడుగంటకుండా 10 నిమిషాలు ఉడికించాలి. తర్వాత పంచదార, మిల్క్‌పౌడర్‌, పిస్తా ముక్కలు వేయాలి. పంచదార పూర్తిగా కరిగాక వెన్న రాసిన ప్లేట్‌లో వేసి 2 గంటల తర్వాత ముక్కలుగా కోసుకోవాలి. 

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలివైభవంగా లక్ష దీపోత్సవంకోతుల నియంత్రణేది ? ఒమైక్రాన్‌ రాకుండా జాగ్రత్త వహించాలివ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలివాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి శాంతి భద్రతల పరిరక్షణకే నిర్బంధ తనిఖీలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న పాలకులు ఫీడింగ్‌ చాంబర్‌కు జాతీయస్థాయి అవార్డు దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి
Advertisement