మామిడి శ్రీఖండ్‌

ABN , First Publish Date - 2016-05-02T20:55:53+05:30 IST

కావలసిన పదార్థాలు: గడ్డపెరుగు- 1 కిలో, మామిడిపండ్ల గుజ్జు- 2 కప్పులు, పంచదార- రుచికి సరిపడా, యాలకుల పొడి- 1/4 టీ స్పూను, పిస్తా పప్పులు- 1 టీ స్పూను.

మామిడి శ్రీఖండ్‌

కావలసిన పదార్థాలు: గడ్డపెరుగు- 1 కిలో, మామిడిపండ్ల గుజ్జు- 2 కప్పులు, పంచదార- రుచికి సరిపడా, యాలకుల పొడి- 1/4 టీ స్పూను, పిస్తా పప్పులు- 1 టీ స్పూను.

తయారీ విధానం:
పెరుగును పల్చటి వస్త్రంలో వేసి రాత్రంతా వేలాడదీసి ఉంచాలి. పెరుగులోని నీరంతా కారిపోయి సుమారుగా ఒక కప్పు పైగా గట్టి పెరుగు తయారవుతుంది. దానిని ఒక గిన్నెలోకి తీసుకుని పంచదార, యాలకుల పొడి, మామిడిగుజ్జు వేసి స్పూన లేదా బీటర్‌తో బాగా గిలకొట్టాలి. ఎలక్ట్రిక్ బీటర్‌తో అయితే శ్రీఖండ్‌ ఇంకా మృదువుగా తయారవుతుంది. తరువాత పిస్తాపప్పుతో అలంక రించాలి.

Updated Date - 2016-05-02T20:55:53+05:30 IST