కావలసిన పదార్ధాలు: బ్రెడ్ - నాలుగు స్లైసులు, గుడ్లు - 2, ఉల్లిపాయ - 1, మిర్చి - 2, కొత్తిమీర - పావుకప్పు, ఉప్పు, కారం - తగినంత, నెయ్యి - 2 స్పూన్లు, క్యారెట్ తురుము కానీ, తురిమిన చీజ్ కానీ, పనీర్ కానీ ఇష్టాన్ని బట్టి ఏదో ఒకటి కలుపుకోవచ్చు.
తయారీ విధానం: సన్నగా తరిగిన ఉల్లి, మిర్చి, కొత్తిమీర, తగినంత ఉప్పు, కారం అన్నీ ఒక గిన్నెలో వేసి కలపాలి. ఎగ్స్ పగలగొట్టి ఇందులో వేసి బీట్ చేయాలి. చివరగా క్యారెట్, పనీర్, చీజ్ ఏదో ఒకటి తురిమి వేసి కలపాలి. ఇప్పుడు ఒక్కో బ్రెడ్ స్లైస్‌నీ ఈ మిశ్రమంలో ముంచి రెండువైపులా పట్టించి జాగ్రత్తగా పెనంపై పెట్టాలి. కొంచెం నెయ్యి వేసి రెండువైపులా మంచి కలర్ వచ్చేవరకూ వేయించి టమోటా కెచ్‌పతో సర్వ్ చేస్తే బావుంటుంది.