బ్రెడ్‌ పుడ్డింగ్‌

ABN , First Publish Date - 2016-04-25T20:33:25+05:30 IST

కావలసిన పదార్ధాలు: బ్రెడ్‌ - నాలుగు స్లైసులు, ఎగ్స్‌ - రెండు, పాలు - రెండు కప్పులు, పంచదార పొడి - ఒక కప్పు, వెనీలా ఎసెన్స - అర స్పూను, యాలకుల పొడి - కొంచెం, నెయ్యి - మూడు టేబుల్‌ స్పూన్లు, జీడిపప్పు, చెర్రీస్‌ - గార్నిష్‌ కోసం

తయారీ విధానం: ముందుగా బ్రెడ్‌ స్లైసె్‌సని మిక్సీలో క్రంబ్స్‌లా చేసుకోవాలి. ఒక మైక్రోవేవ్‌ సేఫ్‌ బౌల్‌లో రెండు స్పూన్లు నెయ్యి, బ్రెడ్‌ క్రంబ్స్‌ వేసి ఒక నిమిషం హైలో పెట్టాలి. తరువాత ఒకసారి కలిపి టెంపరేచర్‌ తగ్గించి ఇంకో నిమిషం పెడితే క్రిస్ప్‌గా వేగుతాయి. ఒక బౌల్‌లో ఎగ్స్‌ వేసి బాగా బీట్‌ చేయాలి. ఇందులో పాలు, పంచదార పొడి వేసి బాగా కలిసేలా బీట్‌ చేయాలి.
 
ఈ బీట్‌ చేసిన మిశ్రమంలో వేయించిన బ్రెడ్‌ క్రంబ్స్‌, యాలకుల పొడి, వెనీలా ఎసెన్స వేసి బాగా కలపాలి. ఇప్పుడు అవెనను కన్వెక్షన మోడ్‌లో 220 డిగ్రీలలో ప్రీహీట్‌ చేసుకోవాలి. తయారు చేసుకున్న బ్రెడ్‌ మిశ్రమాన్ని కొంచెం నెయ్యి రాసుకున్న బేకింగ్‌ మౌల్డ్‌లో వేసుకుని పైన జీడిపప్పు, చెర్రీస్‌ వేసి ప్రీహీట్‌ చేసుకున్న అవెనలో 15 నిమిషాలు బేక్‌ చేసుకోవాలి. వేడిగా తిన్నా, ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా తిన్నా చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2016-04-25T20:33:25+05:30 IST